ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతీ ఎకరాకు సాగు నీరు అందించాలి' - శ్రీకాకుళం కలెక్టరేట్​లో జిల్లా నీటిపారుదల సలహామండలి 26వ సమావేశం

శ్రీకాకుళం కలెక్టరేట్​లోని కలెక్టర్ అధ్యక్షతన 26వ జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో పాల్గొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ సాగునీటి కోసం వంశధార, మడ్డువలస ప్రాజెక్టుల నుంచి జూలై 8న సాధ్యమైనంత మేరకు నీటిని విడుదల చేయుటకు నిర్ణయించడం జరిగిందన్నారు. జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ద వహించి పంటలకు సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు.

నీటిపారుదల సలహామండలి 26వ సమావేశం
నీటిపారుదల సలహామండలి 26వ సమావేశం

By

Published : Jun 20, 2021, 3:49 AM IST

నీటిపారుదల సలహామండలి 26వ సమావేశం

ప్రతీ ఎకరాకు సాగు నీరు అందించేందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణాదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం కలెక్టరేట్​లో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా నీటిపారుదల సలహామండలి 26వ సమావేశంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్ , సీదిరి అప్పలరాజు, సభాపతి తమ్మినేని సీతారాం సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ సాగునీటి కోసం వంశధార, మడ్డువలస ప్రాజెక్టుల నుంచి జులై 8న నీటిని విడుదల చేయడానికి నిర్ణయించామని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details