ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ganja Sales శ్రీకాకుళంలో గంజాయి కలకలం.. వారం రోజుల్లో రెండోసారి పెద్దఎత్తున స్వాధీనం.. 9 మంది అరెస్ట్ - తమిళనాడుకు చెందిన వారు అరెస్ట్

ganja Sales in Srikakulam Dist: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి ఓల్డ్ టోల్ ప్లాజా వద్ద గంజాయి క్రయవిక్రయాల్లో పాలుపంచుకుంటున్న 9 మంది వ్యక్తులను అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి 46 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టిన నేపథ్యంలో అక్రమ రవాణా గుట్టురట్టు చేసినట్లు ఆమె వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిలో తమిళనాడుకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఉండగా.. వారిలో ఓ మైనర్ బాలిక ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 24, 2023, 5:48 PM IST

ganja Sales in Andhra Pradesh: రోజురోజుకు విస్తరిస్తున్న గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చెపట్టినప్పటికీ గంజాయి సాగు, అక్రమ రవాణాకు మాత్రం అడ్డుపడటం లేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో 100 కేజీల గంజాయి పట్టుబడి వారం గడవక ముందే మరో చోట 46 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు.. ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ జి. రాధిక వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి ఓల్డ్ టోల్ ప్లాజా వద్ద గంజాయి క్రయవిక్రయాల్లో పాలుపంచుకుంటున్న 9 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాధిక వెల్లడించారు. వారి వద్ద నుంచి 46 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రాధిక తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టిన నేపథ్యంలో అక్రమ రవాణా గుట్టురట్టు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఇచ్చాపురం పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద దుకాణాలు వద్ద గంజాయి నిల్వ ఉంచి ఇద్దరు మహిళలు అమ్ముతూ ఉంటారనీ... వారి వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసేందుకు తమిళనాడు తంజావూరు కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మహిళలకు రూ. లక్ష50వేల మొత్తాన్ని జూన్ 20వ తేదీన చెల్లించినట్లు తెలిపారు. ఆ గంజాయి తీసుకొచ్చేందుకు తంజావూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులను ఇచ్చాపురం పంపించినట్లు తెలిపారు. శనివారం ఉదయం పాత టోల్ ప్లాజా వద్ద ఇద్దరు మహిళలు తరఫున మోహన్ రావు అనే వ్యక్తి 46 కేజీల గంజాయి తమిళనాడుకు చెందిన ఆరుగురు వ్యక్తులకు అందజేస్తుండగా ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

100 Kg Ganja Seized: ఇద్దరు మహిళల వద్ద పట్టుబడ్డ 100కేజీల గంజాయి.. లారీ డ్రైవర్లే లక్ష్యం...

ఈ కేసులో పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలతో పాటు, అదే గ్రామానికి చెందిన మోహనరావును, తమిళనాడుకు చెందిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రాధిక వెల్లడించారు. వీరిలో ఓ మైనర్ బాలిక కూడా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. 9 మందిని అరెస్టు చేశామని , గంజాయి కొనుగోలు చేసేందుకు ఆర్డర్ చేసిన తంజావూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని రాధిక వెల్లడించారు. జిల్లానుగంజాయి రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే సారా రహిత జిల్లాగా మార్చాలని ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అవన్ని సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. నేరాల నియంత్రణకు సరిహద్దు అంతర్రాష్ట్ర జిల్లాల పోలీసులతో కలిసి పని చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గంజాయి రవాణా, గాంబ్లింగ్ వంటి నేరాలకు సంబంధించి తమకు ఎవరైనా సమాచారమిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వెల్లడించారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు.

Thieves Arrest: దొంగతనాలకు పాల్పడుతున్న పలువురు అరెస్ట్​.. భారీగా సొత్తు స్వాధీనం

గంజాయి క్రయవిక్రయాల్లో పాలుపంచుకుంటున్న 9 మంది వ్యక్తులను అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details