శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పేరాడ తిలక్ వర్గానికి మధ్య విభేదాలతో సంతబొమ్మాళి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. వైకాపా ఎంపీటీసీలు రెండువర్గాలుగా చీలిపోవటంతో..సరైన కోరం లేక ఆర్వో ఎన్నికను వాయిదా వేశారు.
internal clashes in YCP: టెక్కలి వైకాపాలో వర్గ విభేదాలు.. 2 వర్గాలుగా పార్టీ ఎంపీటీసీలు! - ఏపీ తాజా వార్తలు
టెక్కలి వైకాపాలో వర్గ విభేదాలు
17:58 September 24
టెక్కలి వైకాపాలో వర్గ విభేదాలు
వైకాపాలో అన్యాయం జరిగిందంటూ టెక్కలి 8వ ఎంపీటీసీ దేవాది శాంతామణి రాజీనామా చేశారు. ప్రమాణం చేసిన కాసేపటికి శాంతామణి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా నందిగాం మండల ఎంపీపీ పదవి పేరాడ తిలక్ వర్గానికి దక్కింది.
ఇదీ చదవండి
Last Updated : Sep 24, 2021, 8:09 PM IST