శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నం తీరంలో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం కావటంతో సరదాగా ఆరుగురు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు శ్రీకాకుళం నుంచి కళింగపట్నం తీరానికి వెళ్లారు. రాజసింహ ఒడ్డుపై ఉండగా ఐదుగురు విద్యార్థులు సముద్రంలోకి దిగారు. సంద్రపు పోటు ఎక్కువగా ఉండడం వల్ల ఐదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. వీరిలో అబిద్ సురక్షితంగా బయటపడగా.. సుధీర్ అనే విద్యార్థి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన సంజయ్, శివరామ రెడ్డి, నారాయణ పండా కోసం స్థానిక మత్స్యకారుల సహాయంతో మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు.
కళింగపట్నంలో సముద్ర స్నానానికి వెళ్లి.. విద్యార్థుల గల్లంతు - కళింగపట్నం పోర్టులో నలుగురు విద్యార్థులు గల్లంతు న్యూస్

inter students missing in sea
17:22 November 10
సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరు సురక్షితంగా బయటపడగా మరొకరు మృతిచెందారు. ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
కళింగపట్నం: సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్థులు గల్లంతు
Last Updated : Nov 10, 2019, 11:31 PM IST