ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఏజెంట్లు దొంగ ఓట్లు వేయించారంటూ... తెదేపా శ్రేణుల ఆందోళన - Srikakulam District Sarubuzzili Zone Pakir Saheb Peta Polling Station News

సీసీ కెమెరాలు నిలుపుదల చేసి.... వైకాపా ఏజెంట్లు దొంగ ఓట్లు వెేయించారని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పకీర్ సాహెబ్ పేట పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

పకీర్ సాహెబ్ పేట పోలింగ్ కేంద్రంలో తెదేపా శ్రేణులు ఆందోళన
పకీర్ సాహెబ్ పేట పోలింగ్ కేంద్రంలో తెదేపా శ్రేణులు ఆందోళన

By

Published : Apr 8, 2021, 9:43 PM IST

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పకీర్ సాహెబ్ పేట పోలింగ్ కేంద్రంలో ఘర్షణలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వైకాపా ఏజెంట్లు దొంగ ఓట్లు వేయిస్తున్నారని తెదేపా శ్రేణులు ఆరోపించాయి. తమ ఏజెంట్.. ఈ ఘటనను అడ్డుకున్న కారణంగా వైకాపా కార్యకర్తలు దాడి చేశారని తెదేపా నేతలు చెప్పారు. ఇందుకు నిరసనగా పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు.

ఎంపీటీసీ అభ్యర్థి ధనలక్ష్మి భర్త కిల్లి సిద్ధార్థ్ ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు నిలుపుదల చేసి దొంగ ఓట్లు వేయిస్తున్నారని సమాచారం వచ్చిన కారణంగానే.. తాము పోలింగ్ కేంద్రం వద్ద చేరుకున్నామని వివరణ ఇచ్చారు. ఇంతలోపే తమ ఏజెంట్ రాజేష్​పై దాడి చేశారని మండిపడ్డారు. రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details