శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని పలు దుకాణాలలో తూనికలు, కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాంతారావు, రాష్ట్ర లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ అధికారుల అదేశాల మేరకు... ఏసీ విశ్వేశ్వరరావు, నరసన్నపేట ఇన్స్పెక్టర్ కె.రాజారమేష్ తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని ఆరు దుకాణ యజమానులపై కేసులు నమోదు చేశారు. వ్యాపారులు తప్పని సరిగా ప్రభుత్వం ధరల పట్టిక ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని వారు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి మించి ఎక్కువకు అమ్మడం చట్టరీత్యా నేరం అని, వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మితే... ఏసీ ఎస్.విశ్వేశ్వరరావు ఫోన్ నెంబర్ 9398153671కు, ఇన్స్పెక్టర్ కె.రాజారమేష్ 9398124319 గాను నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని ప్రజలకు తెలిపారు.
పాలకొండలో తూనికలు, కొలతల అధికారుల తనిఖీలు - పాలకొండలో తూనికలు అధికారుల వార్తలు
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పలు దుకాణాలలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని దుకాణ యాజమానులపై కేసులు నమోదు చేశారు. దుకాణాలలో ధరలపట్టికను కచ్చితంగా ఏర్పాటుచేయాలని కోరారు.

పాలకొండలో తూనికలు, కొలతల అధికారుల తనిఖీలు