ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తోటల్లోకి ఎలుగుబంట్లు.. భయం గుప్పిట్లో ప్రజలు - ఎలుగుబంట్లు దాడి

శ్రీకాకుళం జిల్లా మన్యం ప్రాంతంలో ఎలుగుబంట్లు దాడి చేస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులకు ఎంత మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తోటల్లోకి ఎలుగుబంట్లు.. భయం గుప్పిట్లో ప్రజలు

By

Published : Aug 10, 2019, 5:08 PM IST

తోటల్లోకి ఎలుగుబంట్లు.. భయం గుప్పిట్లో ప్రజలు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం కొండపల్లి గ్రామ ప్రజలను ఎలుగుబంట్లు భయపెడుతున్నాయి. నిత్యం గ్రామ పరిసరాల్లోని తోటల్లోకి వస్తున్నాయి.. కనిపించిన వ్యక్తులపై దాడులు చేస్తున్నాయి. తాజాగా ఓ జీడితోటలోకి వచ్చిన రెండు ఎలుగుబంట్లు స్థానికులపై దాడి చేశాయి.ఈ దాడిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామంలోకి తరచూ ఎలుగుబంట్లు వస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎలుగుబంట్ల దాడి నుంచి రక్షణ కోసం కుక్కలను కాపలాగా పెట్టుకుంటున్నారు. తాజాగా తోటలోకి వచ్చిన ఎలుగుబంట్లను కుక్కలు తరిమివేశాయి.వరుసగా ఎలుగుబంట్లు దాడులు చేస్తున్నా అటవీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details