గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 10మంది విద్యార్థినులకు అస్వస్థత - శ్రీకాకుళం జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Illness of students: ఆర్.కె.పురం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేశాక.. వాంతులు చేసుకోవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
Illness of students: శ్రీకాకుళం జిల్లా మందస మండలం ఆర్.కె.పురం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేశాక.. అకస్మాత్తుగా వాంతులు చేసుకున్నారు. విద్యార్థినులను హరిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో పల్లవి అనే విద్యార్థినికి శ్వాస సమస్య రావడంతో... టెక్కలి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. భోజనం సరిగా ఉండటం లేదని విద్యార్థినులు చెబుతుండగా.. డీ హైడ్రేషన్ వల్లే అస్వస్థతకు గురయ్యారని ఇంఛార్జ్ ప్రిన్సిపల్ ఎంవీకే శేషాద్రి చెప్పారు.
ఇదీ చదవండి: తిరుపతిలో టోకెన్ల కోసం భక్తుల తోపులాట.. ఐదు రోజులపాటు బ్రేక్ దర్శనాలు రద్దు