శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఉన్న మద్యం దుకాణాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 112 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.20 వేలు ఉంటుందని తెలిపారు. పొందూరు మండలం బురిడి కంచారం గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి.. మురపాక, బుడుమూరు, చిలకపాలెం గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాల నుంచి కొనుగోలు చేసిన 100 సీసాలు, పాతకుంకాం గ్రామానికి చెందిన సతీష్ 12 సీసాలను అక్రమంగా తరలిస్తుండగా లావేరు ఎస్.ఐ చిరంజీవి.. దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని.. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం - srikakulam distict latest news
శ్రీకాకుళం జిల్లా లావేరులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం