ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.3 లక్షల 70 వేల నగదు పట్టివేత - srikakulam palkonda

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కార్గిల్​ కూడలి వద్ద ఎటువంటి ఆధారాలు లేని రూ. 3 లక్షల 70 వేల నగదును పట్టుకున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలో కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పందేలు ఆడుతున్న ఏడుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్​ చేశారు.

srikakulam palkonda
శ్రీకాకుళం జిల్లా పాలకొండ

By

Published : Mar 7, 2021, 4:14 AM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కార్గిల్ కూడలి వద్ద సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 3 లక్షల 70 వేల నగదును పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. కార్గిల్ కూడలిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. పాలకొండ వీరఘట్టం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. డబ్బుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్టు ఎస్సై ప్రసాద్ తెలిపారు.

కోడి పందేల స్థావరాలపై దాడులు..

కోడి పందేల స్థావరాలపై దాడులు

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం, కొత్త పాలెం గ్రామ శివారులోని మడ అటవీ ప్రాంతంలో కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పందేలు ఆడుతున్న ఏడుగురు పందెం రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8 వేల 570 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అడవులదీవి ఎస్సై హరిబాబు హెచ్చరించారు. కోడి పందేలు, పేకాట నిర్వహణ లాంటి ఘటనలపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు.

ఇదీ చదవండి:

మెున్ననే వార్నింగ్ ఇచ్చా.. ఇక యాక్షన్​లోకి దిగుతా: తమ్మినేని వాణి శ్రీ

ABOUT THE AUTHOR

...view details