ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒడిశా నుంచి తరలిస్తున్న ధాన్యం పట్టివేత - illeagle graine

ఒడిశా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న ధాన్యాన్ని శ్రీకాకుళం జిల్లా టెక్కలి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 7లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

Illegal grain shifting from Odisha is seazed in tekkali
ఒడిశా నుంచి తరలిస్తున్న అక్రమ ధాన్యం పట్టివేత

By

Published : Apr 9, 2020, 4:54 PM IST

ఒడిశా రాష్ట్రం బరంపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు అక్రమంగా తరలిస్తున్న రెండు లారీల ధాన్యాన్ని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీలపై పోలీసులకు అనుమానం రావడంతో వారు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. లారీ చోదకులను వివరాలు అడగ్గో.. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. ఫలితంగా రూ.7 లక్షల విలువైన 380 క్వింటాళ్ల ధాన్యాన్ని అధికారులు సీజ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details