శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురంలో ఐఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కొండపల్లి మనీషాఅంజు(16) అనే విద్యార్థిని వసతి గృహంలోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 14న మనీషాఅంజుని తల్లి కరుణ కుమారి కళాశాల వద్ద దించి వెళ్లింది. 15వ తేదీన ఆరోగ్యం బాగా లేదని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో తండ్రి సూరిబాబు కళాశాలకు వచ్చి కుమార్తెకు ధైర్యం చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇవాళ మనీషాఅంజు ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారని కళాశాల సిబ్బంది వెల్లడించారు.