ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా ఓటింగ్ పెరిగింది.. మరలా అధికారంలోకి వస్తాం' - ichchapuram mla doctor bendalam ashok latest news

పంచాయతీ ఎన్నికల్లో తెదేపా ఓటింగ్ శాతం పెరిగిందని.. త్వరలోనే మరలా అధికారంలోకి వస్తుందని ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ ధీమా వ్యక్తం చేశారు. బాలకృష్ణాపురం గ్రామంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఆయనకు గ్రామస్థులు, తెదేపా నేతలు ఘనస్వాగతం పలికారు.

ichchapuram mla doctor bendalam ashok
విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్

By

Published : Feb 23, 2021, 8:09 PM IST


రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటోందని.. అందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిదర్శనమన్నారు ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. బాలకృష్ణాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్​గా తెదేపా బలపరిచిన అభ్యర్థి బతకల కుమారమ్మ గెలిచారు. ఈ మేరకు గ్రామంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా ఎన్నికలేని గ్రామ పంచాయతీలో తెదేపా బలపరిచిన అభ్యర్థి గెలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అధికార పార్టీ కారణంగా రెండేళ్లుగా గ్రామాల అభివృద్ధికి దూరంగా ఉన్నాయని, ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును అందుకు అనుగుణంగా ఇచ్చారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details