లాక్డౌన్లో అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి రక్షణ పరికరాలను ఇవ్వాలని కోరుతూ.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి పేద కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. మూసివేసిన ఉన్న క్యాంటీన్లను తెరిపించి, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. ధాన్యం, పత్తి, మిర్చి పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ వ్యాప్తి నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఇచ్ఛాపురం ఎమ్మెల్యే 12 గంటల నిరాహార దీక్ష - ఇచ్చాపురంలో లాక్డౌన్ ప్రభావం
పలు డిమాండ్ల పరిష్కారం కోరుతూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఇచ్చాపురం ఎమ్మెల్యే 12 గంటల నిరాహార దీక్ష