కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా.. శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో బ్లీచింగ్, హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రపరచారు. ఈప్రక్రియ కొద్ది రోజుల పాటు కొనసాగిస్తామని కమిషనర్ నల్లనయ్య తెలిపారు.
శ్రీకాకుళంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పరిశుభ్రత చర్యలు - sanitization programme
కరోనా వైరస్ నివారణకు అధికారులు పరిశుభ్రత చర్యలను ముమ్మరం చేశారు. రద్దీ ప్రదేశాల్లో రసాయనాలను పిచికారి చేయడం, ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు.
శ్రీకాకుళంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పరిశుభ్రత చర్యలు