శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం అంబకండి గ్రామంలో హైనా(Hyena halchal in Ambakandi) సంచారం.. స్థానికంగా హల్చల్ చేసింది. అంబకండి, సోమన్నపేట గ్రామాల మధ్య పంటపొలాల్లో చిరుతపులిని పోలి ఉన్న జంతువును స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది.. పంట పొలాల్లో ఉన్న అడుగులను పరిశీలించి అది పులి కాదు.. పులి పోలికలు ఉన్న హైనాగా గుర్తించారు. జిల్లాలో పులుల సంచారం లేదని.. ఎవరూ భయపడాల్సిన పని లేదని అధికారులు సూచించారు.
అంబకండిలో హైనా హల్చల్.. చిరుత అనుకొని స్థానికుల ఆందోళన - శ్రీకాకుళం జిల్లా అంబకండిలో హైనా హల్చల్
శ్రీకాకుళం జిల్లా అంబకండి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో చిరుతపులిని పోలిన జంతువు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాన్ని హైనా(Hyena halchal in Ambakandi)గా అటవీశాఖ అధికారులు గుర్తించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

అంబకండి గ్రామంలో హైనా హల్చల్