ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Murder: భార్యను హత్య చేసి.. పోలీసుల ముందు లొంగిపోయి.. - శ్రీకాకుళంలో భార్యను హత్య చేసిన భర్త

Murder: క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతో మంది అనాథలవుతున్నారు. స్వల్ప వివాదాలకు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా.. శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దంపతుల మధ్య నెలకొన్న వివాదంలో కోపోద్రిక్తుడైన భర్త.. భార్యను హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోయాడు.

husband murdered wife in srikakulam
భార్యను హత్య చేసిన భర్తను

By

Published : Jun 1, 2022, 1:48 PM IST


Murder: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పూడివలసలో జరిగింది. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య మంగళవారం రాత్రి గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగటంతో.. కోపాద్రిక్తుడైన భర్త.. భార్య గొంతు నులిమి హత్యకు పాల్పడ్డాడు. బాధితురాలు నాగరత్నం (46) ఫరీద్ పేటలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.

హత్య అనంతరం.. నిందితుడు రామారావు పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయినట్లు.. ఎస్సై రాము తెలిపారు. నాగరత్నం హత్యతో పూడివలసలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడి భవిష్యత్తును తలుచుకొని మృతురాలి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details