శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని ఆధార్ కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పథకంలో భాగంగా.. కొత్తగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టడంతో మహిళలు ఆధార్ కార్డులను నవీకరించుకునేందుకు బారులు తీరారు. మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కేంద్రం వద్ద నిరీక్షించారు. ఇప్పటికే పట్టణంలో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో.. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆధార్ కేంద్రం వద్ద మహిళల రద్దీ..కొవిడ్ నిబంధనలు బేఖాతరు - ఆధార్ కేంద్రం వద్ద మహిళల రద్దీ తాజా వార్తలు
ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రజలు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని ఆధార్ కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పథకంలో భాగంగా.. కొత్తగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టడంతో మహిళలు ఆధార్ కార్డులను నవీకరించుకునేందుకు బారులు తీరారు.
![ఆధార్ కేంద్రం వద్ద మహిళల రద్దీ..కొవిడ్ నిబంధనలు బేఖాతరు rush at aadhar centre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:04:16:1621596856-ap-sklm-72-21-adhar-kendram-vadda-raddi-av-ap10144-photos-21052021151250-2105f-1621590170-597.jpg)
rush at aadhar centre