ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కవిటి తీరానికొచ్చిన భారీ కొమ్ముకోణం చేప - huge fish caught at koviti sea

మత్స్య సంపదకు పేరుగాంచిన శ్రీకాకుళంలో భారీ చేప లభించింది. కవిటి సముద్రతీరంలో స్థానికులు గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు. గాయం కారణంగా ఒడ్డుకు చేరి ఉంటుందని భావిస్తున్నారు. వేలంపాట నిర్వహించిన మత్స్యకారులకు లాభాల పంట పండింది.

kommu konam fish
కొమ్ము కోణం చేప

By

Published : Oct 17, 2020, 8:34 PM IST

పధ్నాలుగు అడుగుల భారీ కొమ్ము కోణం చేప మత్స్యకారులకు చిక్కింది. శ్రీకాకుళం జిల్లా కవిటిలోని ఇద్ధివానిపాలెం తీరంలో.. ఈ మత్స్యాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పడవలో వెళ్లి.. చాకచక్యంగా తాడుతో బంధించి ఒడ్డుకు తీసుకువచ్చారు.

కొమ్ము కోణం చేప

చేప బరువు 300 కిలోలు ఉంటుందని అంచనా. కంటి గాయం కారణంగా నీటిలో తేలియాడుతూ ఒడ్డుకు చేరిందని భావిస్తున్నారు. మోహన్ రావు అనే స్థానిక వ్యాపారి.. రూ. 8,500కు వేలంలో దక్కించుకుని విశాఖపట్నం తరలించారు.

ABOUT THE AUTHOR

...view details