కరోనా వైరస్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. చాలా రోజుల తర్వాత నేడు ఒక్కసారిగా మద్యం దుకాణాలు తెరవడంతో మందుబాబులు వందల సంఖ్యలో మద్యం దుకాణాల ముందు ఉదయం 9 గంటల నుంచే భారీ స్థాయిలో బారులు తీరారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో ఉన్న మద్యం దుకాణాలను 11 గంటలకు తెరిచారు.
మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందు బాబులు - మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందు బాబులు
లాక్డౌన్ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవటంతో మందు ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలోని మద్యం దుకాణాల ముందు ఉదయం నుంచే పడిగాపులు కాశారు.
వివిధ గ్రామాల నుంచి వచ్చిన మందుబాబులు ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద ఉదయం నుంచే కాపలా కాశారు. పలుచోట్ల దుకాణాల ముందు మూకుమ్మడిగా చేరారు. దీంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మందుబాబులకు భౌతిక దూరం పాటించాలని సూచనలు చేశారు.