శ్రీకాకుళం జిల్లా సీతంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందాడు. డీఎస్పీ కార్యాలయంలో విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న హోంగార్డు సోమేశ్వర రావు.. ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్నాడు. ఈ ఘటనలో సోమేశ్వర రహదారిపై పడిపోవడం వల్ల వెనకనే వస్తున్న టిప్పర్ ఆయన పైనుంచి వెళ్లిపోయింది. దీంతో హోంగార్డు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలాన్ని పాలకొండ డీఎస్పీ ప్రసాద్ సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు దుర్మరణం - శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా సీతంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు సోమేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న తరుణంలో ద్విచక్రవాహనాన్ని ఢికొని రోడ్డుపై పడిన ఆయన పైనుంచి టిప్పర్ వాహనం వెళ్లిపోయింది. దీంతో ఘటన స్థలంలో హోంగార్డు దుర్మరణం చెందాడు.
![రోడ్డు ప్రమాదంలో హోంగార్డు దుర్మరణం home guard dead in road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8086633-1074-8086633-1595153283631.jpg)
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు దుర్మారణం