ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వొని గడ్డకు గండి...100ఎకరాల్లో నీటిమునిగిన వరినారు - taja news of srikakulam dst paddy farmers

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం మర్రిపాడు కొత్తవలస గ్రామాల మధ్య వొని గడ్డకు గండి పడి 100 ఎకరాల్లో వేసిన వరినారు ముంపుకు గురవుతుంది. కళ్లముందే పంట నాశనం అవుతుందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

whole to voni gadda in srikakulam dst paddy crops damaged
whole to voni gadda in srikakulam dst paddy crops damaged

By

Published : Jul 29, 2020, 12:26 PM IST

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస పంచాయతీ మర్రిపాడు కొత్తవలస గ్రామాల మధ్య వొని గడ్డకు వంతెన గండి పడింది. సుమారు 100 ఎకరాల వరకు వరి నాట్లు ముంపుకి గురయ్యాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వంతెన వద్ద రైతులకు అవసరమైనప్పుడు పొలాలకు నీరందించేందుకు పైపు ఏర్పాటు చేశారు.

గడ్డ ఉద్ధృతంగా ప్రవహించటంతో పైపు కొట్టుకు పోయి... పొలాల్లోకి నీరు చేరుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వరి నాటు వేసి కొద్ది రోజులే కావటంతో వరి నాటు కొట్టు పోతుందని ఆందోళన చెందుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో శాశ్వత పనులు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి
బాధ్యత ఉండక్కర్లేదా....భారం పెంచుతావా?

ABOUT THE AUTHOR

...view details