డీఎస్సీ-2002 హిందీ పండిట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏపీఏటీ (ఏపీఅడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్) ఆదేశానుసారం... 2019లో శ్రీకాకుళం జిల్లా నుంచి 35 మంది నియామక ఉత్తర్వులు పొందారు. అనంతరం వారికి కేటాయించిన ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే తమకు 15 నెలలుగా జీతాలు ఇవ్వలేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటివరకు ట్రెజరీ ఐడీ నెంబర్ గానీ, జీతభత్యాలు అందలేదని తెలిపారు. జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అభ్యర్థులు వారి సమస్యలను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కి తెలిపి, వినతిపత్రం సమర్పించారు.
మాకు జీతాలు వచ్చేలా చూడండీ: హిందీ పండిట్లు విజ్ఞప్తి - స్పీకర్ తమ్మినేనికి వినతి పత్రం అందించిన హిందీ పండిట్లు
ఏపీఏటీ ఆదేశాల ప్రకారం 2019లో ఉద్యోగాలు పొందిన డీఎస్సీ-2002 హిందీ పండిట్ అభ్యర్థులు జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై అభ్యర్థులు స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. 15 నెలలుగా ఉద్యోగం చేస్తున్నా... జీతాలు ఇవ్వడంలేదని, కనీసం ట్రెజరీ ఐడీ నెంబర్ కేటాయించలేదని అభ్యర్థులు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.
tammineni seetaram
2017, 2019లో ఉద్యోగాలు పొందిన హిందీ ఉపాధ్యాయులకు ఇంతవరకు నోషనల్ సీనియార్టీ కల్పించలేదని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. సర్వీస్ అమరావతి నుంచి నోషనల్ సర్వీస్ కల్పించమని ఉత్తర్వులు వెలువడినప్పటికీ డీఈవో కార్యాలయం నుంచి ఫైల్ కదలడంలేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని స్పీకర్‌ను కోరారు.
ఇదీ చదవండి :'ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదు'