HIGH COURT ORDERS: తండ్రి, కుమార్తెల అదృశ్యం ఘటనపై వాస్తవాలను తేల్చి, వాంగ్మూలాలను నమోదు చేసేందుకు వారిని శుక్రవారం కోర్టు ముందు ఉంచేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. వారి అదృశ్యంపై జిల్లా ఎస్పీ ద్వారా తక్షణం విచారణ జరిపించాలంటూ జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఆదేశాలిచ్చారు.
తండ్రీ, కుమార్తె అదృశ్యానికి కారణాలు తేల్చండి: హైకోర్టు - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
HIGH COURT ORDERS: తండ్రి, కుమార్తెల అదృశ్యం ఘటనపై వాస్తవాలను తేల్చి , వాంగ్మూలాలను నమోదు చేసేందుకు వారిని శుక్రవారం కోర్టు ముందు ఉంచేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..: శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని ఓ గ్రామంలో ఈనెల 23/24 తేదీల్లో జరగాల్సిన వివాహాన్ని పంచాయతీ కార్యదర్శి / గ్రామ స్థాయి బాల్య వివాహాల అధికారి అడ్డుకుంటున్నారని పేర్కొంటూ ఎం. ఆదినారాయణ , ఆయన కుమార్తె ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు . ఈనెల 19 న హైకోర్టులో జరిగిన విచారణలో వివరాలు సమర్పించేందుకు మహిళ శిశుసంక్షేమశాఖ ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు.దీంతో విచారణ ఈనెల 20 కి వాయిదా పడింది.
ఇదీ చదవండి:విజయవాడ ప్రభుత్వాస్పత్రి దగ్గర ప్రజాసంఘాల ఆందోళన.. ఉద్రిక్తత