శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో పేదప్రజలకు పట్టణంలోని ఓ ప్రైవెేట్ స్కూల్ యాజమాన్యం సరుకులు పంపిణీ చేసింది. కరోనా వ్యాప్తితో లాక్డౌన్ అమలవుతున్న వేళ ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలకు సహాయం అందించారు. రేగిడి, వంగర, రాజాం, సంతకవిటి, తెర్లాం మండలాలకు చెందిన గ్రామస్థులకు సరుకులు అందించారు. వీటి కోసం 6 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు స్కూల్ చైర్మన్ అల్లాడ జనార్థన్ తెలిపారు. అలాగే 41 మంది జర్నలిస్టులకు సరుకులను పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - శ్రీకాకుళంలో లాక్డౌన్ వార్తలు
లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలకు దాతలు అండగా నిలుస్తున్నారు. నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో పేదలకు సరుకులు పంపిణీ చేసి ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మానవత్వం చాటుకుంది.
helping to poor people