పొంగిపొర్లుతున్న మహేంద్రతనయ నది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఆంధ్ర ఒడిశా(andhra-orissa) పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో.. మహేంద్రతనయ(mahendratanaya) నది వరద నీటి ప్రవాహం పెరిగింది. పాతపట్నం-గోపాలపురం గ్రామాల మధ్య ఉన్న కాజ్వే పై వరద నీటి ప్రవాహం పెరగటంతో.. గోపాలపురం గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. మెళియాపుట్టి మండలం గోకర్ణపురంలో వర్షపు నీరు ఎక్కువ కావడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
పోటెత్తుతున్న మడ్డువలస జలాశయం
జిల్లాలోని వంగర మండలం మడ్డువలస జలాశయానికి వరద పోటెత్తుతోంది. దీంతో సువర్ణముఖి, వేగవతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ ప్రభావానికి గీతనాపల్లి, కొండచాకరాపల్లి, కొప్పెర గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మడ్డువలస ప్రాజెక్టు నుంచి నాగావళి నదిలోకి నీరు విడుదల చేయడంతో.. నారాయణపురం ఆనకట్టతో పాటు శ్రీకాకుళం నగరంలో నాగావళి నది జోరుగా ప్రవహిస్తోంది. అలాగే గోట్టాబ్యారేజ్ నుంచి వంశధార వరదనీరును దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో వంశధార నది నిలకడగా పారుతుంది.
ఇదీ చదవండి:
GULAB CYCLONE: గులాబ్ కుదిపేసింది..శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు వణికించింది