శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పరిధిలో ఎడతెరిపి లేని వర్షాలకు పంటపొలాలు నీట మునిగాయి. జల్లులు తగ్గినా... అనేక ప్రాంతాల్లో జరగకూడని నష్టం జరిగిపోయింది. పంటలు నీటమునిగి రైతులు లబోదిబోమంటున్నారు. లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లోని అనేక ప్రాంతాల్లో రహదారులు చిన్నపాటి నదులను తలపిస్తున్నాయి. ఎచ్చెర్ల పరిధిలో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచాయి. సుమారు 3 వేల 500 హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
వర్షాలకు నీటిలోనే పంట.. 40 గ్రామాలకు రాకపోకలు బంద్ - శ్రీకాకుళంలో నీటమునిగిన పంట
ఎడతెరిపి లేని వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో పంటపొలాలు నీట మునిగాయి. లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాంలో రహదారులు జలమయమయ్యాయి. ఎచ్చెర్ల పరిధిలో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
heavy-rains-in-srikakulam