వరదలో చిక్కుకున్న సిక్కోలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంతో పాటు పరిసర మండలాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో వర్షాలు అధికంగా కురుస్తుండటంతో మహేంద్రతనయ నదిలో వరద ప్రవాహం పెరిగి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కే గోపాలపురం, హెచ్ గోపాలపురం గ్రామాలలకు వెళ్లే కాజ్వే నీటి మునగటంతో ఆయా గ్రామ ప్రజలు రైలు వంతెనపై రెండు కిలోమీటర్ల మేర ప్రమాదకరంగా ప్రయాణిస్తూ గ్రామాలు చేరుకుంటున్నారు.జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రణస్థలం, సంచాం, పైడిభీమవరం గ్రామాల మధ్యలో ఉన్న గెడ్డలో వరద ప్రవాహ ఉద్ధృతికి ఓ ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. గమనించిన స్థానిక యువకులు ద్విచక్రవాహనాన్ని అతి కష్టం మీద బయటకు తీశారు.