ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం - rains latest news in srikakulam

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం కురిసింది. వీరఘట్టం మండలంలోని అరటి తోటలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జిల్లాలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం

By

Published : Apr 26, 2020, 11:09 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల ఈదురు గాలులు హోరెత్తించాయి. వీరఘట్టం మండలంలో అరటి తోటలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జిల్లాలోని శ్రీకాకుళం, వీరఘట్టం, పాలకొండ, రాజాం, సీతంపేట, ఆమదాలవలస, నరసన్నపేట, కోటబొమ్మాళిలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా జిల్లాలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చూడండి:కరోనా ప్రభావం.. అకాల వర్షం.. అరటి రైతుకు నష్టం

ABOUT THE AUTHOR

...view details