ఒడిశా, శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. వంశధార, నాగావళి నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. మడ్డువలస ప్రాజెక్టు నుంచి 7 గేట్ల ద్వారా నాగావళిలోకి నీరు విడుదల చేశారు. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. గీతనాపల్లి, కొండచాకరాపల్లి, కొప్పర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నదీపరీవాహక ప్రాంతాల్లో నాగావళి జోరుగా ప్రవహిస్తోంది.
భారీవర్షాలు... సాయం కోసం ప్రజల ఎదురుచూపులు - heavy rains in ap
శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. మడ్డువలస ప్రాజెక్టు ఎగువన సువర్ణముఖి నదీతీర గ్రామాలు... ముంపునకు గురైయ్యాయి. గీతనపల్లి, కొప్పర, కొండచాకరపల్లి గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఆయా గ్రామాల ప్రజలు వరదనీటిలో ఉండి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షాలు
శ్రీకాకుళం జిల్లాలో బహుదా నది ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. నదీపరీవాహక ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పాలనాధికారి నివాస్ అధికారులను ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదులు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వంగర మండలం మడ్డువలస ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేశారు. నాగావళి నదిలోకి 50 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో నేడు ఉరుములతో కూడిన వర్షాలు !