ఎడతెరిపి లేని వర్షాలకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నదులు ఉప్పొంగాయి. నాగావళి, వంశధార నదులు వరదతో పోటెత్తాయి. మడ్డువలస, తోటపల్లి ప్రాజెక్ట్ నుంచి నాగావళికి వరద నీరు వచ్చి చేరడంతో.......సంతకవిటి మండలంలో పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. మెళియాపుట్టి మండలంలో రాధాకాంత సాగరం గెడ్డ ప్రవాహానికి గోకర్ణపురానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు గాలించినా ఆచూకి లభ్యం కాలేదు. బాహుదా నది ప్రవాహం కూడా తోడవుతున్నందున.....నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నివాస్ సూచించారు. ఎప్పటికప్పుడు వరద సమాచారం సేకరించేలా మండల కేంద్రాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
యువకుడు గల్లంతు...
సంతబొమ్మాళి మండలం మూలపేటలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు యువకుల్లో......ఒకరు ప్రమాదవశాత్తు జారిపడి నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయాడు. యువకుడిని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన మేరుగు నరేష్‌గా గుర్తించిన పోలీసులు....గజఈతగాళ్లతో సుమారు 8 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా యువకుడి జాడ లభ్యంకాలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటు చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపేశారు. ఈ రోజు మళ్లీ కొనసాగిస్తామని తెలిపారు. మూలపేట పరలో వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని, చేపల వేటకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు. టెక్కలి నియోజకవర్గంలో గత మూడ్రోజులుగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పట్టణంలోని మండాపొలం కాలనీలో జనం నడుంలోతు నీళ్లలో రాకపోకలు కొనసాగిస్తున్నారు. భవానినగర్, శ్రీనివాస నగర్ ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
విశాఖ మన్యంలోనూ....