ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిక్కోలులో ఈదురుగాలులతో భారీ వర్షం..నేలకొరిగిన చెట్లు - శ్రీకాకుళంలో భారీ వర్షానికి పిడుగులు తాజా అప్ డేట్స్

శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులు, భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చెట్లు విరిగిపడి.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల పిడుగులు పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

heavy rain in srikakulam
సిక్కోలులో కుండపోత వర్షం

By

Published : Apr 28, 2021, 8:01 AM IST

శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులు, భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రాజాం, పాలకొండ, భామిని, బూర్జ, సీతంపేట, వీరఘట్టం, ఎచ్చెర్ల, లావేరు, రేగిడి తదితర మండలాల్లో కురిసిన వర్షానికి పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. వీరఘట్టం మండలంలోని చెట్టు కూలి కారు ధ్వంసం అయ్యింది. విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లావేరు మండలం జాతీయ రహదారి తాళ్లవలస గ్రామానికి సమీపంలోని చెట్లపై పిడుగులు పడటంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

వర్షానికి ముందు భారీ ఎత్తున ఈదురుగాలులు, ఉరుములతో పాటు ఎక్కడికక్కడ పిడుగులు పడుతుండటంతో.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలో వారం రోజుల వ్యవధిలో పిడుగుపాటుకు గురై సుమారు 8 మంది వరకు మృతి చెందారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details