అనంతపురం జిల్లా ధర్మవరంలో భారీ వర్షం కురిసింది. 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధర్మవరం గ్రామీణ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు, వంతెనలు జలమయమయ్యాయి. ధర్మవరం గాంధీనగర్ రైల్వే అండర్ బ్రిడ్జి మార్గంలో వర్షపు నీరు భారీగా నిలిచింది. పోలీసులు ఏర్పాటు చేసిన టెంట్లు వర్షానికి కూలిపోయాయి. తాడిమర్రి మండలంలో అరటి పంటకు నష్టం వాటిల్లింది.
ధర్మవరంలో భారీ వర్షం - ధర్మవరం నేటి వార్తలు
అనంతపురం జిల్లా ధర్మవరంలో కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రహదారులపై భారీగా వరద నీరు నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో కురిసిన వానతో పంటలు దెబ్బతిన్నాయి.
![ధర్మవరంలో భారీ వర్షం Heavy rain in Dharmavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6986188-321-6986188-1588154075918.jpg)
ధర్మవరం రహదారులపై నిలిచిన వరద నీరు