ఆమదాలవలసలో భారీ వర్షం - heavy rain in srikakulam district
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో ఆదివారం మధ్నాహ్నం భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజులు వర్షం లేకుంటే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్‌కు విత్తనాలు వేసుకునే వాళ్లమని రైతులు ఆవేదన చెందుతున్నారు.
![ఆమదాలవలసలో భారీ వర్షం heavy rain in amdalavalsa srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7998007-175-7998007-1594555906061.jpg)
ఆమదాలవలసలో భారీ వర్షం
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో అదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉండటంతో రైతులు ఖరీఫ్ సీజన్ కు విత్తనాలు వేసుకునేందుకు పోలాలకు వెళ్లగా ఒక్కసారిగా వర్షం కురవటంతో వారు వెనుదిరిగారు. మరో మూడురోజులు వర్షం కురవకపోయుంటే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో విత్తనాలు వేసుకునే వాళ్లమని రైతులు చెబుతున్నారు.