శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు, మరికొన్ని పట్టణ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రంగా ఎండకాచి సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ సిబ్బంది వాటిని తొలగించి పునరుద్ధరించారు. ఈ వర్షం వరిపంటకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తంచేశారు.
ఆమదాలవలస నియోజకవర్గంలో భారీ వర్షం - ఆమదాలవలసలో భారీ వర్షం
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు, మరికొన్ని పట్టణ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడింది.
![ఆమదాలవలస నియోజకవర్గంలో భారీ వర్షం heavy rain in amadalavalasa srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8559781-772-8559781-1598423221911.jpg)
ఆమదాలవలసలో భారీ వర్షం