ఆముదాలవలసలో రాత్రి నుంచి వర్షం
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. ఈ వానలు సాగుకు ఉపయోగకరమని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
heavy_rain_at_srikakulam_district_amudhalavalasa
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో.. మంగళవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. చెరువులు, వాగులు, వంకలు నిండాయి. ఖరీఫ్ సాగుకు ఈ వానలు ఉపయోగమని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు నారుమళ్లకు నీరు లేదని.. ఇప్పుడు వరుణ దేవుడు కరుణించాడని ఆనందించారు.