శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మద్యం ప్రియులు బారులు తీరారు. స్థానిక పాత బస్టాండ్లోని మద్యం దుకాణం నుంచి గొడుగులు పట్టుకుని వీరంతా వరుస కట్టడం గమనార్హం. కరోనా వైరస్ పట్ల ఏ మాత్రం భయం లేకుండా బారులు తీరడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైరస్ భయాన్ని మరిచారు... మద్యం కోసం బారులు తీరారు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకుండా నరసన్నపేటలో మద్యం ప్రియులు మద్యం కోసం బారులు తీరడం ఆందోళన కలిగిస్తోంది.
నరసన్నపేటలో మద్యంకోసం బారులు