Headmaster came to school with drunk alcohol: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు.. పూటుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. మద్యం తాగి వచ్చిన ప్రధానోపాధ్యాయుడు తిరుపతి.. కనీసం నిలబడలేని స్థితిలో ఉన్నాడు. మత్తులో జోగుతూ.. నేలపైనే కూర్చుండిపోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పారవలస ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది. విషయం తెలుసుకొని పాఠశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు.. అతడిని ఆ స్థితిలో చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువు చెప్పాల్సిన మాస్టారు.. ఇలా ఉంటే పిల్లలను బడికి ఎలా పంపిస్తామని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే మరొక మాస్టారిని పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
తాగి ఊగుతూ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు.. ఆపై.. - ap news
Headmaster came to school with drunk alcohol: శ్రీకాకుళం జిల్లా కొప్పారవలస ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. మద్యం తాగి పాఠశాలకు వచ్చారు. కనీసం నిలబడలేని స్థితిలో ఉన్న ప్రధానోపాధ్యాయుడు తిరుపతి.. మత్తులో జోగుతూ నేలపైనే కూర్చుండిపోయాడు.
మద్యం తాగి పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు
ప్రస్తుతం అక్కడ మొత్తం 52 మంది పిల్లలు చదువుతుండగా.. ఇద్దరు టీచర్ల ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడు తిరుపతి తాగి రాగా.. మరో ఉపాధ్య యురాలు సెలవులో ఉన్నారు. దీంతో పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు.
ఇదీ చదవండి..Lokesh On Panchayat Funds Transfer Issue: ఆ నిధులను తక్షణమే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలి: లోకేశ్
Last Updated : Nov 30, 2021, 8:44 PM IST