ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

HC Judge: "కేసులు పెండింగ్​లో ఉండటానికి.. ప్రభుత్వాలే కారణం.."

High Court Judge Justice Battu Devanand: దేశంలో లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలపై అంతర్మథనం జరగటం లేదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ అన్నారు. ఈ జాప్యానికి పది కారణాలుంటే వాటిలో చివరి రెండు కారణాలే న్యాయవాదులు, న్యాయమూర్తులు అని... మిగిలిన వాటన్నింటికీ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలే అని చెప్పారు.

High court judge Justice Battu devanand
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌

By

Published : Apr 11, 2022, 7:35 AM IST

High court judge Justice Battu devanand: దేశంలో లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలపై అంతర్మథనం జరగటం లేదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ అభిప్రాయపడ్డారు. "అందరూ సత్వర న్యాయం కోరుకుంటున్నారు... అది సాధ్యం కావడంలేదు... దీనికి న్యాయవాదులు, న్యాయమూర్తులే కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ జాప్యానికి పది కారణాలుంటే వాటిలో చివరి రెండు కారణాలే న్యాయవాదులు, న్యాయమూర్తులు. మిగిలిన వాటన్నింటికీ బాధ్యత వహించాల్సింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే. కోర్టుల్లో పనిచేయడానికి తగిన వాతావరణం లేకుండా, కావాల్సిన మౌలిక సదుపాయాలు లేకుండా, తగినంత సిబ్బందిని ఇవ్వకుండా పని ఎలా జరుగుతుంది. న్యాయాధికారుల పోస్టుల్లోనూ 40-50 శాతం ఖాళీలున్నాయి. దీనికి ఎవరు కారణం? స్టెనోగ్రాఫర్‌ లేకుండా ఒక న్యాయాధికారి తన విధులు నిర్వర్తించగలరా? కనీసం న్యాయాధికారులకు సరైన నివాస భవనాలు లేకుండా ప్రశాంతంగా విధుల్ని నిర్వర్తించగలరా? న్యాయవాదులకు బార్‌ అసోసియేషన్‌, దానిలో ఉండాల్సిన సౌకర్యాలు, మహిళా న్యాయవాదులకు కావాల్సిన సౌకర్యాలు లేవు. కక్షిదారులు వేచి ఉండడానికి సౌకర్యాలు, కనీసం మరుగుదొడ్లు లేని పరిస్థితి చాలా చోట్ల ఉంది. దీన్ని చాలా ముఖ్యమైన సమస్యగా గుర్తించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ జాతీయ మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు" అని జస్టిస్‌ బట్టు దేవానంద్‌ పేర్కొన్నారు. పలాస జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు భవన సముదాయం నిర్మాణ పనులకు మరో న్యాయమూర్తి జస్టిస్‌ రాజశేఖర్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇదీ చదవండి: మూడో వంతు ప్రాంతానికి ప్రాతినిధ్యమే లేదు.. ఇంతకాలం చేసిన కసరత్తు ఇదేనా..!

ABOUT THE AUTHOR

...view details