ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరెంటు కోతల గిఫ్ట్.. "స్నేహితులు రాక్.. వధూవరులు షాక్"..! - latest news in srikakulam

Variety Gift: పెళ్లిలో వధూవరులకు బంగారం, వెండి, ఖరీదైన వస్తువులు బహుమతులుగా ఇవ్వడం సర్వసాధారణం. అయితే.. ఏపీలో మాత్రం వధూవరులకు వారి స్నేహితులు సరికొత్త గిఫ్ట్ బహూకరించారు. ఆ బహుమతిని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మరి, అదేంటో మీరూ చూడండి.

variety gift to newly married couple
పెళ్లిలో వినూత్న బహుమతి

By

Published : Apr 11, 2022, 7:23 PM IST

Variety Gift: శ్రీకాకుళం జిల్లా సోంపేటలో పెళ్లి చేసుకున్న ఓ కొత్త జంటకు మిత్రుల నుంచి సరికొత్త బహుమతి అందింది. సాధారణంగా.. బంగారం, వెండి ఆభరణాలు, దుస్తులు ఇతర కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. కానీ.. సురేష్, నందిని అనే కొత్త దంపతులకు వారి స్నేహితులు విసనకర్రలు గిఫ్టుగా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ కోతల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. నూతన దంపతులకు సరదాగా ఈ బహుమతి ఇచ్చినట్లు మిత్రులు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

పెళ్లిలో వినూత్న బహుమతి

ABOUT THE AUTHOR

...view details