ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వడగళ్ల వాన బీభత్సం... మృత్యువాత పడ్డ విహంగాలు - gusani hailstiones rain

ఒడిశాలో వడగళ్ల వాన విషాదం నింపింది. వడగళ్ల వాన పక్షులకు కష్టాలు మిగిల్చాయి. వందల సంఖ్యలో పక్షులకు గాయాలు కాగా.. అనేక విహంగాలు మృత్యువాతపడ్డాయి.

hailstones-rain-in-gusani-at-osissa
hailstones-rain-in-gusani-at-osissa

By

Published : Mar 20, 2020, 5:59 PM IST

గుసానిలో వడగళ్ల వాన

గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన ఒడిశా రాష్ట్రంలో గుసాని ప్రాంతంలో కురిసింది. పెద్ద ఎత్తున వర్షంతో పాటు వడగళ్లు పడటంతో రహదారులన్నీ ధవళవర్ణంలో కనువిందు చేశాయి. అప్పటివరకు ఉక్కపోతగా ఉన్న వాతావరణం.. వర్షం రాకతో ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోయింది. మరోవైపు వడగళ్ల వాన పక్షులకు కష్టాలను మిగిల్చింది. వందల సంఖ్యలో విహంగాలు గాయాలపాలు కాగా, పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన తమ నేస్తాల వద్ద పక్షులు చేసిన అరుపులు చూపరులను కన్నీళ్లు పెట్టించాయి.

ABOUT THE AUTHOR

...view details