శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరినాయుడు పేటలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. కుళాయి పైపులైను విషయంలో ఇరు పార్టీల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ వివాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజాం రూరల్ సీఐ శ్రీనివాసరావు... సంతకవిటి ఎస్సై రామారావు గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా వర్గీయులు సంతకవిటి పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున చేరుకుని కొట్లాటకు కారకులైన తెదేపా వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు.
సంతకవిటిలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ - srikakulam latest group war news in telugu
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేట గ్రామంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ వివాదంలో పలువురు గాయపడగా.. వారిని రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
group war between ycp tdp at srikakulam districtgroup war between ycp tdp at srikakulam district