Port construction in Srikakulam District: శ్రీకాకుళం జిల్లా భావనపాడు గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి సంతబొమ్మాళి మండలం మూలపేట, విష్ణుచక్రం గ్రామస్థులతో మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు అధికారులకు రైతులనుంచి నిరసన సెగ తగిలింది. భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.20 లక్షలు పరిహారం అందిస్తామని మంత్రి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ ప్రకటించారు. నవంబర్ నెలాఖరులో గానీ, డిసెంబర్లో గాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి చెప్పారు.
గ్రీన్ఫీల్డ్ పోర్ట్ గ్రామసభలో రైతుల గందరగోళం.. చెక్కుల పంపిణీ నిలిపివేత - Greenfield port
Greenfield port meeting: ఆ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల దగ్గర భూములు తీసుకోవాలనుకుంది. అందుకోసం నష్ట పరిహారంగా ఎకరాకు రూ.20 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ రోజు ఆయా గ్రామాల పరిధిలోని రైతులకు చెక్కులు పంచేందుకు మంత్రి, కలెక్టర్ అధికారులు వచ్చారు. చెక్కులు పంచే సమయంలో ఆయా గ్రామాల్లోని ఉన్న జిరాయితీ భూముల పరిహారం విషయం తేల్చాలని గ్రామస్థులు పట్టుబట్టారు. అనంతరం చెక్కుల పంపిణీ చేయాలని భీష్మించుకు కూర్చున్నారు. వారితో మంతనాలు జరిపిన మంత్రి చేసేదేమీ లేక చెక్కుల పంపిణీ కార్యక్రమం వాయిదా వేసి వెనుదిరిగారు.
అనంతరం భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులకు చెక్కులు అందజేసి, శాలువతో సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చెక్కులు అందుకోవడానికి సిద్ధమైన వారిని గ్రామస్థులు అడ్డుకున్నారు. జిరాయితీ భూముల పరిహారం విషయం తేల్చాలని గ్రామస్థులు పట్టుబట్టారు. వారిని నేతలు, అధికారులు పలు విధాలుగా ఒప్పించే ప్రయత్నం చేశారు. అన్యాయం జరగకుండా చూస్తామని, ప్రజల తరపున నిలబడతామని చెప్పినా గ్రామస్థులు అంగీకరించలేదు. పరిహారం తమకు సరిపోదని, ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 నిమిషాలకు పైగా వేచి చూసిన మంత్రి, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్.. చేసేదేమీ లేక పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం వాయిదా వేసి వెనుదిరిగారు.
ఇవీ చదవండి: