శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రానైట్ పరిశ్రమలో రాజస్థాన్‌కు చెందిన 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. లోక్డౌన్ కారణంగా తమ స్వస్థలానికి వెళ్లేందుకు వారంతా లారీలో బయల్దేరారు. జిల్లా మలియపుట్టి మండలంలోని వసుందర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు లారీని నిలిపివేసి, వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోటబొమ్మాలిలో క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు పాతపట్నం సీఐ రవిప్రసాద్ తెలిపారు.
లారీలో 50 మంది ప్రయాణం... అడ్డుకున్న పోలీసులు - శ్రీకాకుళంలో గ్రానైట్ పరిశ్రమలో కార్మికుల అవస్థలు
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్న 50 మంది కార్మికులు తమ ప్రాంతానికి లారీలో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారందరినీ క్వారంటైన్‌కి తరలించారు.
లారీలో 50 మంది ప్రయాణం... అడ్డుకున్న పోలీసులు