రాజమహేంద్రవరంలో పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అలరించాయి. భోగి మంటలు, హరిదాసు కీర్తనులు, గంగిరెద్దు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీల్లో మగువలు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక ఎస్కేవీటీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఆటపాటలతో అలరించారు.
గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ క్యాంపస్‌లో తెలుగుసంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. హరిదాసు కీర్తనలు, కోలాటాలతో ప్రాంగణంలో పల్లెవాతావరణాన్ని తెచ్చారు. విద్యాసంస్థల ఛైర్మన్ లావురత్తయ్య వేడుకల్లో పాల్గొని విద్యార్థుల్ని ఉత్సాహపరిచారు.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో లక్ష ఒక్క పిడకల భోగి మహోత్సవం నిర్వహించగా కలెక్టర్ నివాస్, ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ హాజరయ్యారు. ఆధ్యాత్మిక నగరి తిరుపతి శిల్పారామం, తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద భోగి మంటలు వేశారు.