ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు - eruvaka pournami festival

సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ... రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏరువాక పున్నమిని ఘనంగా నిర్వహించారు. భూమాతకు, కాడెడ్లకు పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించారు. కొన్ని చోట్ల రాజకీయ నేతలు రైతులను సన్మానించారు.

grandly celebrations of eruvaka pournami in andhrapradhesh
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు

By

Published : Jun 24, 2021, 10:25 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం హరేసముద్రం గ్రామంలో ఏరువాక పూర్ణిమ ఘనంగా నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని రైతులు ప్రార్థించారు. తెలుగుదేశం హయాంలో ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించామని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ శాసనసభ్యుడు ఆనందరావు అన్నారు. రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా... విజయనగరం జిల్లా కొమరాడ మండలం విక్రమపురంలో రైతులను సన్మానించారు.

కర్నూలు జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో ఏరువాక పున్నమి వేడుకలను నిర్వహించారు. కాడెడ్లకు పూజలు చేసి, వ్యవసాయ పనులు ప్రారంభించారు. రైతుల కోసం గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాలని తెదేపా నేత శ్రీరామ్ తాతయ్య కోరారు. మంత్రాలయంలో ఎడ్ల పందాలు నిర్వహించారు. గెలుపొందిన ఎడ్లను ఊరేగించారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులందరూ ఆనందంగా ఉండాలని కోరుతూ... శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజిపురంలో ఏరువాక పౌర్ణమిని జరుపుకున్నారు.

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం లో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పలు గ్రామాల్లో రైతులు ఎద్దులు పరుగు పందెం నిర్వహించారు. గెలుపొందిన ఎద్దులను ఊరేగింపు నిర్వహించారు. సింహాచలం దేవస్థానంలో ఏరువాక పున్నమిని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాడెడ్లకు, భూమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దుక్కి దున్ని విత్తనాలు చల్లారు.

ఇదీ చదవండి:

Exams Cancelled: పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details