శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రూ.6.70 కోట్లతో ప్రస్తుత హాస్టల్ బ్లాక్ లను తరగతి గదులుగా మార్చేందుకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది.
ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో తరగతి గదుల నిర్మాణానికి అనుమతులు - ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. జీప్లస్ త్రీ తరహా తరగతి గదుల సముదాయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రిపుల్ ఐటీ ఛాన్సలర్ ను ఆదేశించింది.
ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో తరగతి గదుల నిర్మాణానికి అనుమతులు
అదే విధంగా రూ.66.70 కోట్లతో తరగతి గదుల సముదాయాల నిర్మాణానికి అనుమతులిచ్చింది. జీప్లస్ త్రీ తరగతి గదుల సముదాయాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌జీయూకేటీ ఛాన్సలర్ ను ఆదేశించింది.
ఇదీ చదవండి :