శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పునరావాసం పొందుతున్న వలస కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. గుజరాత్ నుంచి నాలుగు రోజుల క్రితం వచ్చిన 414 మంది వలస కార్మికులకు 2000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇచ్చేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా నరసన్నపేట సమీపంలోని క్లారిటీ స్కూల్లో పునరావాసం పొందుతున్న 149 మంది వలస కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అధికారులు అందజేశారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించి వారి స్వగ్రామాలకు త్వరలో తరలించనున్నారు.
వలస కార్మికులకు రూ.2వేల ఆర్థిక సాయం
గుజరాత్ నుంచి జిల్లాకు వచ్చిన కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. మనిషికి రూ.2వేల చొప్పున అధికారులు అందజేశారు.
govt gave finacial supoert to migrate woekers in srikakulam dst