ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు...శ్రీకాకుళం జిల్లాలో గవర్నర్ పర్యటన

గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఎచ్చెర్ల, ఇచ్ఛాపురంలో గవర్నర్‌ పర్యటన సాగనుంది. ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్  సైన్స్ కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం ఇచ్ఛాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు.

Governor biswa bhushan tour to srikakulam
నేడు...శ్రీకాకుళం జిల్లాలో గవర్నర్ పర్యటన

By

Published : Nov 28, 2019, 6:23 AM IST

Updated : Nov 28, 2019, 7:36 AM IST

నేడు...శ్రీకాకుళం జిల్లాలో గవర్నర్ పర్యటన
గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఎచ్చెర్ల చేరుకోనున్న గవర్నర్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం ఇచ్ఛాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ప్రారంభిస్తారు.

ఏపీ సైన్స్ కాంగ్రెస్​కు శ్రీకారం

ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్‌కు ఈ సారి శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వేదికైంది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నేటి నుంచి శనివారం వరకు ఈ కార్యక్రమం జరగనుంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కులపతి హాదాలో సమావేశాలను ప్రారంభిస్తారని విశ్వవిద్యాలయ ఉపకులపతి కూన రామ్‌జీ తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగ పరిశోధన, సమకాలీన అంశాలపై అవగాహనకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. అభివృద్ధి రంగాల కోసం సైన్స్ అనే అంశంపై ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అమరావతి సంయుక్తంగా వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభం

ఇచ్ఛాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక వ్యాపారవేత్త వజ్రపు వెంకటేష్ నిర్మించిన నూతన భవనాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రారంభించనున్నారు. ఇక్కడ పది గదులను విద్యార్థులకు సౌకర్యవంతంగా నిర్మించారు. చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకునేందుకు తల్లిదండ్రుల పేరిట వితరణ చేసినట్లు దాత తెలిపారు.

అనంతరం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జిల్లా పర్యటన ముగించుకొని గవర్నర్ విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు.

ఇదీ చదవండి :

అమిత్​ షా తో తెదేపా ఎంపీల భేటీ..కారణమిదే..!

Last Updated : Nov 28, 2019, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details