శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డా. బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీగా విశ్రాంత ఆచార్యులు డా. నిమ్మ వెంకటరమణను నియమిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపకులపతిగా డా. కూన రామ్జీ పదవీకాలం గత ఏడాది డిసెంబర్ 8వ తేదీతో ముగియడంతో ఇంచార్జ్ వీసీగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర కొనసాగుతున్నారు.
అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీగా డా. నిమ్మ వెంకటరమణ - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీగా విశ్రాంత ఆచార్యులు డా. నిమ్మ వెంకటరమణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
![అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీగా డా. నిమ్మ వెంకటరమణ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీగా డా. నిమ్మ వెంకటరమణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10292142-58-10292142-1610993229102.jpg)
అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీగా డా. నిమ్మ వెంకటరమణ
ఆచార్య నిమ్మ వెంకటరమణ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందినవారు. ఈయన ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని విద్యా విభాగంలో ఆచార్యులుగా పని చేసి సెప్టెంబర్ 2019లో పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం అంబేడ్కర్ విశ్వవిద్యాలయం విద్యా విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్గా, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఫీజు నియంత్రణ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి